: 2050 నాటికి ఏపీ అత్యున్నత రాష్ట్రంగా ఉండాలి: చంద్రబాబు
కష్టాలను, సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని, వనరులు, అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2050 నాటికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత రాష్ట్రంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. కడప జిల్లా అలంఖాన్ పల్లెలో నిర్వహించిన 'జన్మభూమి-మావూరు' సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమలో భూగర్భ ఖనిజ సంపద ఉందని, సీమకు నీళ్లు ఇవ్వగలిగితే అభివృద్ధి సాధ్యమని అన్నారు. క్రమశిక్షణ, దూరదృష్టితో ఏదైనా సాధ్యమన్న సీఎం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అనునిత్యం పనిచేస్తున్నామని తెలిపారు. 12 లక్షల 50 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. ఎన్ని సమస్యలున్నా రైతుల రుణాలు తీరుస్తున్నామని పేర్కొన్నారు.