: పఠాన్ కోట్ దాడి సూత్రధారులపై పాక్ వేగంగా చర్యలు తీసుకోవాల్సిందే: అమెరికా


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి సూత్రధారులను పాకిస్థాన్ చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని అగ్రరాజ్యం అమెరికా మరోమారు తేల్చిచెప్పింది. దాడి జరిగిన నాడే ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అమెరికా, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నడుం బిగించాల్సిందేనని పిలుపునిచ్చింది. తాజాగా దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ముమ్మాటికీ పాక్ జాతీయులేనని చెబుతున్న భారత్, దాడి వ్యూహకర్తలు కూడా పాకిస్థాన్ లో ఉన్నారని పలు ఆధారాలను వెలికితీసింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు పాక్ తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని అంతమొదించేందుకు బహిరంగంగానే కాక అంతర్గత భేటీల్లో పాక్ చేసిన హామీలను కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సదరు అధికారి తేల్చిచెప్పారు. వీలయినంత త్వరగా పఠాన్ కోట్ దాడి సూత్రధారులను పాక్ కోర్టు ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News