: చర్లపల్లి జైలులో నిందితుడు భానుకిరణ్ వద్ద మందు బాటిల్స్ లభ్యం


చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు ఇవాళ నిర్వహించిన తనిఖీల్లో మద్యం బాటిల్స్ బయటపడ్డాయి. జైల్లోని మానస బ్యారక్ లో 10 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాటిళ్లు మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడైన భానుకిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. అతనికి మద్యం బాటిళ్లు ఎవరు సరఫరా చేశారన్న విషయంపై జైలు సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది.

  • Loading...

More Telugu News