: ఇకపై దుకాణాల్లో ఆర్మీ దుస్తులు దొరకవు... పఠాన్ కోట్ ప్రభావం


ఇకపై సామాన్యులెవరూ ఆర్మీ దుస్తులను ధరించలేరు. అలాంటి ముచ్చట ఉన్న ఎవరైనా సరే... ఈ మాట ఎత్తకూడదు. దీనికి కారణం పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో జరిగిన ఉగ్రదాడే కారణం. ఈ ఘటనకు కారకులైన ముష్కరులు ఆర్మీ దుస్తులను ధరించి దేశంలోకి ప్రవేశించి, ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తేలిన దరిమిలా ప్రభుత్వం ఆర్మీ దుస్తులను పోలిన దుస్తుల అమ్మకాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు సైన్యం వినియోగించే ఇతర వస్తువులు కూడా మార్కెట్ లో కనిపించకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

  • Loading...

More Telugu News