: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కర్నూల్ జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. భూమాతో బాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ఈరోజు మీడియాతో మాట్లాడారు. కర్నూల్ జిల్లాలో తమ పార్టీ చాలా బలంగా ఉందని.. ఈ పార్టీలో నుంచి ఎవరూ బయటకు వెళ్లరని అన్నారు. పార్టీ పటిష్టతను దెబ్బతీసేందుకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. ప్రాణం ఉన్నంత వరకూ తాము జగన్ పార్టీలోనే ఉంటామని భూమా స్పష్టం చేశారు.