: గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొననున్న విదేశీసైన్యం!
ఢిల్లీలోని రాజ్ పథ్ లో ఈసారి నిర్వహించనున్న భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఈ పరేడ్ లో ఫ్రాన్స్ సైన్యం భారత సైనికదళంతో పాటు పాల్గొననుంది. భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఒక విదేశీ సైనికదళం పాల్గొననుండటం ఇదే తొలిసారి. కాగా, ఫ్రాన్స్ కు చెందిన 35వ ఇన్ ఫాంట్రి రెజిమెంట్ దళం ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది. పరేడ్ రిహార్సల్స్ లో 56 మంది ఫ్రాన్స్ సైనికులు ఈరోజు నుంచే పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు హొలాండే ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.