: ఆ బాలుడిని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
నవ్యాంధ్ర నిర్మాణానికి ఒక పాఠశాలకు చెందిన బాలుడు పది డాలర్లను విరాళంగా ఇచ్చాడు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురంలో జరిగిన జన్మభూమి సభలో ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి స్వయంగా ఆ బాలుడే అందజేశాడు. ఈ విరాళం స్వీకరించిన బాబు ఆ బాలుడిని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ బాలుడిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరికీ ఉందన్నారు. అందరిలోనూ ఇది మన రాష్ట్రం అనే భావన ఉండాలన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం నిధులను బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలను బాబు కొట్టిపారేశారు.