: దర్శకుడు దాసరిని కలసిన రాంగోపాల్ వర్మ
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కలిశారు. ఈ విషయాన్ని దాసరి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రాన్ని తాను చూశానని దాసరి పేర్కొన్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ తో పాటు వాళ్లిద్దరూ ఉన్న ఒక ఫొటోను కూడా దాసరి పోస్ట్ చేశారు. కాగా, కిల్లింగ్ వీరప్పన్ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదలైంది.