: జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు... ఉత్తర్వులు విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 25 ద్వారా ఈరోజు ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 150 డివిజన్లకు గాను అన్ రిజర్వుడు 44, మహిళల జనరల్ 44, బీసీ జనరల్-25, బీసీ ఉమెన్- 25 ఎస్సీ జనరల్-5, ఎస్సీ ఉమెన్-5, ఎస్టీ జనరల్-1, ఎస్టీ ఉమెన్-1గా రిజర్వేషన్లు కేటాయించారు. ఇందులో కాప్రా-ఎస్సీ జనరల్; ఎఎస్ రావు నగర్- జనరల్ మహిళ, చర్లపల్లి-బీసీ జనరల్; మీర్ పేట హెచ్ బీ కాలనీ- ఎస్సీ జనరల్, మల్లాపూర్- జనరల్, నాచారం- జనరల్ మహిళ, చిల్కానగర్ -జనరల్ మహిళ, హబ్సిగూడ-జనరల్ మహిళ, చర్లపల్లి- బీసీ జనరల్, శిఖ్ ఛావనీ - బీసీ జనరల్, సంతోష్ నగర్ -బీసీ జనరల్, చాంద్రాయణ గుట్ట - బీసీ జనరల్, శాలిబండ- బీసీ జనరల్, గోషామహల్- బీసీ జనరల్, పురానాపూల్- బీసీ జనరల్, దూద్ బౌలి- బీసీ జనరల్, జహనుమా- బీసీ జనరల్, రామ్ నాస్ పురా- బీసీ జనరల్, కిషన్ బాగ్- బీసీ జనరల్, శాస్త్రీపురం- బీసీ జనరల్, రాజేంద్రనగర్- బీసీ జనరల్, దత్తాత్రేయనగర్- బీసీ జనరల్, కార్వాన్- బీసీ జనరల్, నానక్ నగర్- బీసీ జనరల్, హయత్ నగర్ - ఎస్సీ జనరల్, జియాగూడ- ఎస్సీ జనరల్, మచ్చ బొల్లారం -ఎస్సీ జనరల్, వెంకటాపురం-ఎస్సీ జనరల్ కు కేటాయించారు. ఈ వివరాలన్నింటినీ వెబ్ సైట్ లో పొందుపరిచారు.