: ఆల్ ఖైదా హిట్ లిస్టులో బీజేపీ నేతలు


కరడుగట్టిన తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా హిట్ లిస్టులో పలువురు బీజేపీ నేతలు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. గత బుధవారం ఆల్ ఖైదాకు చెందిన ఉగ్రవాది సయ్యద్ అజర్ షా ఖాజ్మీని ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. అతనిని విచారించిన అధికారులు పలు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆల్ ఖైదా హిట్ లిస్టులో పలువురు బీజేపీ నేతలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి, అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించాలంటూ ఈ నెల 20 వరకు అతనిని కస్టడీలోకి తీసుకున్నారు. అతనికి రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తున్నారు. అలాగే భారత్ లో ఆల్ ఖైదా ఎలాంటి దాడులకు పాల్పడనుందనే ప్రాథమిక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News