: సీమాంధ్ర, తెలంగాణ వాళ్లు కొట్టుకోవాలని టీడీపీ చూస్తోంది: కేటీఆర్


హైదరాబాదులోని సీమాంధ్ర, తెలంగాణ వాళ్లు కొట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. స్థానిక యూసుఫ్ గూడలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీలో నాలుగు ఓట్ల కోసం ఆ పార్టీ చెత్త రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే గతంలో టీడీపీ, కాంగ్రెస్ చేయని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గ్రేటర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని, ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బాల్కసుమన్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News