: కుక్కలు, పిల్లులు అయిపోయాయి... ఇక తినడానికి మట్టే మిగిలింది... సిరియాలో దారుణస్థితి!


అవును... ఇది ముమ్మాటికీ నిజం... ఇది సిరియాలోని మండాయ్ పట్టణంలో చోటుచేసుకున్న దుస్థితి. అబు అబ్దుల్లా నాలుగు రోజుల నుంచి మెతుకు కూడా ముట్టలేదు. సిరియాలోని మండాయ్ పట్టణానికి చెందిన రహమాన్, అతని కుటుంబ సభ్యులు ఆకలితో పూర్తిగా క్షీణించిపోయి ఉన్నారు. దీంతో కనీసం ఏ పనీ కూడా చేయలేని స్థితికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రహమాన్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఈ పట్టణంలో చివరికి కుక్కలు, పిల్లులు కూడా మిగలలేదు. ఆకులు, గడ్డి కూడా దొరకడం దుర్లభమైపోయిందన్నాడు. కాగా మీడియా ప్రతినిధులకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడి ప్రజలు ప్రస్తుతం ఆకలిని అదిమిపెట్టుకునేందుకు మట్టిని తింటున్నారు. దీనికి తోడు ఈ ప్రాంతానికి ఇంధనం, మందుల సరఫరా కూడా ఆగిపోయింది. గత ఏడాది జూలై నుండి ఈ ప్రాంతాన్ని సిరియాకు చెందిన బషర్ అల్ అసద్ సైన్యం తన అధీనంలో ఉంచుకుంది. కాగా ఐక్యరాజ్యసమితి ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం గడచిన 5 సంవత్సరాల్లో సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధాల కారణంగా ఇప్పటివరకూ 2,50,000 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

  • Loading...

More Telugu News