: కేజ్రీవాల్... మమతల దోస్తీ పక్కా
ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల దోస్తీ పక్కా అయ్యింది. పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే కొత్త రాజకీయాలకు తెరలేపారు. ఇందుకు నాందిగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో కేజ్రీవాల్ పాల్గొననున్నారు. శుక్రవారం నుండి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగస్వామ్యం వహించేందుకు వేరే రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మాత్రమే హాజరు కావడం విశేషం. ఈ సంవత్సరం పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది మొదట్లోనే పంజాబ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సారధి అరవింద్ కేజ్రీవాల్ వీలైనన్ని రాష్ట్రాల్లో పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.