: సోనియా తెలంగాణ ఇవ్వకపోతే వాళ్లిద్దరూ ఎక్కడ ఉండేవాళ్లో!: వీహెచ్


సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవారో వారు తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. రంజాన్, క్రిస్మస్ పండగలకు పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేసిన కేసీఆర్ సర్కార్ కు హిందువులు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. శబరిమల పుణ్యక్షేత్రంలో తెలంగాణ భవన్ నిర్మాణం నిమిత్తం ఐదు ఎకరాల స్థలం కేటాయించిన కేరళ సీఎం ఉమెన్ చాందీకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అక్కడ స్థలం కేటాయించాలని వీహెచ్ కోరారు.

  • Loading...

More Telugu News