: సినీ కార్మికులకు రేషన్ కార్డులు ఇస్తాం... చిత్రపురి కాలనీకి బస్సులు నడిపిస్తాం: కేటీఆర్
50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమను ఎవరూ పట్టించుకోలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సినీ కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, చిత్రపురి కాలనీలో రోడ్డును విస్తరిస్తామని, ఆ కాలనీకి బస్సులు నడిపిస్తామని అన్నారు. చిత్ర పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదని, హైదరాబాద్ లోనే ఉంటుందని అన్నారు. చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, సినిమా ఇండస్ట్రీలోని దరిదాపు అన్ని విభాగాల వారు నివసించే చిత్రపురి కాలనీ ల్యాంకో హిల్స్ కు అతి సమీపంలో ఉంది. చిత్రపురికాలనీలో సినిమా షూటింగ్ లు కూడా బాగా జరుగుతుంటాయి. ప్రముఖ అగ్ర హీరో బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' చిత్రంలోని ఒక పాటను ఈ కాలనీలోనే షూట్ చేశారు.