: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపు సరికాదు: హైకోర్టు


జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి, ఇతరులు వేసిన పిటిషన్ పై ఉమ్మడి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ను కుదించడంపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించగా, ఈ నెల 31లోగా ఎన్నికల ప్రక్రియను ముగించాలని గతంలో కోర్టు ఆదేశించినందున, ఆ సమయంలోగా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నంలోనే కుదించామని వివరించారు. దీనికి స్పందించిన కోర్టు, షెడ్యూల్ కుదింపు సరికాదని పేర్కొంది. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి ఒక తేదీని ప్రకటించాలని, దానిపై ప్రభుత్వాన్ని అడిగి సమాధానం చెప్పాలని తెలంగాణ ఏజీని కోర్టు ఆదేశించింది. అవసరమైతే తాము మరో వారం, పది రోజుల సమయం ఇస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News