: టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం


ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి హాలులో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో... పురాణం సతీష్ (ఆదిలాబాద్), భూపతి రెడ్డి (నిజామాబాద్), టి.భాను ప్రసాద్ (కరీంనగర్-1), నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్-2), వి.భూపాల్ రెడ్డి (మెదక్), పట్నం నరేందర్ రెడ్డి (రంగారెడ్డి-1), శంభీపూర్ రాజు(రంగారెడ్డి-2), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్ నగర్-1), కొండా మురళి (వరంగల్), బి.లక్ష్మి నారాయణ (ఖమ్మం) ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News