: తమిళ సర్కార్ నిర్ణయం.. తెలుగు విద్యార్థుల భవిష్యత్ అంధకారం: యార్లగడ్డ


తమిళ భాషను తప్పనిసరి చేస్తూ అక్కడి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు విద్యార్థుల భవిష్యత్ అంధకారం కానుందని జాతీయ హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా విద్యార్థులు తమిళ భాషలో పరీక్షలు రాయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొనడం బాధాకరమన్నారు. తమిళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో వివిధ భాషలకు చెందిన 2,75,000 మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడనుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు, మలయాళం, కన్నడ, ఉర్దూ భాషలకు చెందిన విద్యార్థులను కేవలం ఆరు నెలల్లో తమిళ భాషలో పరీక్షలు రాయమనడం దారుణమని లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News