: ఏపీ రాజధానిలో నాలుగు మెట్రో లైన్లు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో నాలుగు మెట్రో రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 108.17 కిలోమీటర్ల మేర ఈ కారిడార్లు నిర్మించాలని మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. మొదటి కారిడార్ ను విజయవాడతో, నాలుగో కారిడార్ ను గుంటూరుతో రాజధానికి అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ విధమైన రూపకల్పన చేశారు. కాగా విజయవాడలో ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టుతో ఈ కారిడార్ ను అనుసంధానించాలని యోచిస్తున్నారు. కాగా, ఈ నాలుగు కారిడార్లకు మొత్తం రూ. 24 వేల కోట్ల రూపాయలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.