: మన కోర్టుల్లో 3 కోట్ల కేసులు మూలుగుతున్నాయ్!
కోర్టుల్లో చాలాకాలంగా మూలుగుతున్న కేసులను సత్వరం పరిష్కరించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న దరిమిలా వివిధ కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టులోనే సుమారు కోటి కేసులు పెండింగ్ లో ఉండగా, దేశంలోని అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టులలో మరో రెండు కోట్ల కేసులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే మొత్తం ఈ 3 కోట్ల కేసులు అనుకున్నంత త్వరగా పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనికి కారణం, దేశంలోని పలు హైకోర్టుల్లో 43 శాతం పదవులు ఖాళీగా ఉన్నాయి. అలాగే వివిధ కోర్టుల్లో 1,044 మంది జడ్జీల నియామకం కూడా పెండింగ్ లో ఉంది.