: కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆమ్లా...కొత్త కెప్టెన్ డివిలియర్స్


సఫారీ టెస్టు జట్టు కెప్టెన్సీకి హషీమ్ ఆమ్లా గుడ్ బై చెప్పేశాడు. గ్రేమ్ స్మిత్ నుంచి 2014లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న హషీమ్ ఆమ్లా మొత్తం 14 టెస్టులకు సారథ్యం వహించాడు. ఇందులో నాలుగింటిలో విజయం సొంతం చేసుకోగా, ఆరు టెస్టుల్లో పరాజయం పాలైంది. వీటిలో మూడు టెస్టుల్లో టీమిండియా చేతిలో ఘోరపరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ తో తొలి టెస్టులో ఓటమి పాలైన సంగతి కూడా తెలిసిందే. గత ఏడాది కాలంగా ఫాం లేమితో సతమతమవుతున్న హషీమ్ ఆమ్లా, జట్టు పగ్గాలు డివిలియర్స్ కు అప్పగించాడు. ఇంగ్లండ్ తో జరగనున్న రెండు టెస్టులకు డివిలియర్స్ సారథ్యం వహించనున్నాడు. రెండో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, సీనియర్ సభ్యుడిగా ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందని ఆమ్లా పేర్కొన్నాడు. దానికి న్యాయం చేయాలంటే బాధ్యతల నుంచి తప్పుకోవడమే ఉత్తమమని, జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తక్షణం వైదొలుగుతున్నానని ఆమ్లా స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News