: లెఫ్టెనెంట్ కల్నల్ నిరంజన్ పై వ్యాఖ్యలు చేసిన అన్వర్ సాధిక్ అరెస్టు
మలయాళ పత్రిక 'మాధ్యమం' రిపోర్టర్ నని చెప్పుకుని ఫేస్ బుక్ తప్పుడు పేరుతో ఖాతా తెరిచి, తాజాగా పఠాన్ కోట్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ పై వ్యాఖ్యలు చేసిన అన్వర్ సాధిక్ అరెస్టయ్యాడు. నిరంజన్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన అన్వర్ ఫేస్ బుక్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు రాశాడు. దాంతో పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 124(ఏ) కింద కేసు నమోదు చేశారు. తరువాత అదుపులోకి తీసుకున్నారు. అయితే 'మాధ్యమం' పత్రిక యాజమాన్యమే అన్వర్ పై ఈ కేసు పెట్టిందట.