: రాజధాని కోసం విద్యార్థుల నుంచి విరాళాల సేకరణపై హైకోర్టు స్టే


నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం ప్రతి ఒక్క విద్యార్థి నుంచి రూ.10 సేకరించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. విద్యార్థుల నుంచి విరాళాల సేకరణకు సర్క్యులర్ ఎలా విడుదల చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మేరకు విరాళాలను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు పైవిధంగా తీర్పు వెలువరించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి విరాళాలు సేకరించడం తగదని, విద్యాశాఖ కమిషనర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని సూటిగా అడిగింది.

  • Loading...

More Telugu News