: పాకిస్థాన్ పై భారత్ ఎలాంటి ఆరోపణలు చేయలేదు: పాక్ రక్షణ శాఖ మంత్రి


భారత్, పాకిస్థాన్ లు చర్చల దిశగా ముందడుగు వేస్తున్న సమయంలో పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ ఖండించారు. ఇరు దేశాల మధ్య విభేదాలు పెంచడానికి విద్రోహులు చేసే కుట్రలు సఫలం కావని ఆ దేశ రేడియోతో మాట్లాడుతూ అన్నారు. అయితే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి విషయంలో పాక్ పై భారత్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాల కోసం ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్ లు టెలిఫోన్ లో చర్చించడమే ఉగ్రవాదులకు గట్టి సంకేతమన్నారు. పాక్ కూడా ఉగ్ర బాధిత దేశమేనని, తీవ్రవాదంతో తామూ గట్టిగా పోరాడుతున్నామని అసిఫ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News