: సరి-బేసి విధానంపై ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు


ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సరి-బేసి విధానంపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విధానానికి వ్యతిరేకంగా దాఖలైన 8 మంది పిటిషన్ లను కోర్టు విచారించింది. ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ ను 15 రోజులకు బదులు వారం రోజుల పాటు అమలు చేస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. ఈ వారంలో రోజుల్లో కాలుష్యం ఎంత తగ్గిందో 8వ రోజున నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ కాలుష్యం తగ్గలేదని తేలితే సరి-బేసి నిబంధనను ఎత్తివేయాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రజా రవాణా అంత సమర్థవంతంగా లేదని, ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News