: విమాన ప్రయాణికులకు మలేసియా ఎయిర్ లైన్స్ ఆంక్షలు
ఐరోపా దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు మలేసియా ఎయిర్ లైన్స్ ఆంక్షలు విధించింది. ప్రయాణికులు తమతో పాటు భారీ లగేజీలు తెస్తే విమానానికి ఇబ్బందులొస్తాయని, ఎకానమీ క్లాస్ లో ప్రయాణించేవారు ఒక్కొక్కరూ 7 కేజీల బరువుగల లగేజీలను మాత్రమే తేవాలని చెబుతోంది. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు 14 కేజీల వరకు తెచ్చుకోవచ్చునని ప్రకటించింది. అకాలంగా బలమైన గాలులు వీస్తున్నాయని, అందువల్ల ప్రయాణికుల బ్యాగేజీ బరువులపై పరిమితులు విధిస్తున్నామని ఎయిర్ లైన్స్ ప్రకటించింది. సూదూర ప్రాంతం ప్రయాణించవలసి ఉంటుందని కాబట్టి జెట్ ఇంధనం అధికంగా ఖర్చవుతుందని పేర్కొంది. భద్రతా కారణాల రీత్యా ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని వెల్లడించింది.