: అమెరికాలో తెలుగు విద్యార్థుల సమస్యలపై సుష్మకు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కు తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. అమెరికాలో తెలుగు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై దృష్టి పెట్టాలని కోరారు. అమెరికాలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రికి లేఖలో కేటీఆర్ విన్నవించారు. అవసరమైతే ఈ విషయంపై మంత్రిని కలుస్తానని తెలిపారు. కాగా నిన్న(మంగళవారం)నే హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ అధికారులను కలసిన కేటీఆర్ విద్యార్థుల సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే.