: ఫ్లెమింగో ఫెస్టివల్ లో అరుదైన దృశ్యం...మంత్రి నారాయణ, ఎంపీ మేకపాటి కలిసిన వైనం


నెల్లూరు నగర శివారులో నేటి ఉదయం ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట జరిగిన 2కే రన్ కలర్ ఫుల్ గా సాగింది. ట్రాక్ సూట్ వేసిన ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ యువతతో కలిసి రోడ్డుపై పరుగులు పెట్టారు. ఇక ఈ ఫెస్టివల్ లో ఓ అరుదైన దృశ్యం కూడా కనిపించింది. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఆది నుంచి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, టీడీపీకి చెందిన మంత్రి నారాయణతో కలిసి మీడియా కెమెరాల ముందు తళుక్కున మెరిశారు. నారాయణతో కరచాలనం చేసిన మేకపాటి ఆద్యంతం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News