: అత్యంత భద్రతను అందించే విమాన సంస్థలు... అత్యంత ప్రమాదకర ఎయిర్ లైన్స్ జాబితా!


ప్రపంచంలో ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తున్న అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ జాబితాను, అత్యంత ప్రమాదకర విమానయాన సంస్థలు, అతి తక్కువ ధరలకు విమాన ప్రయాణాన్ని దగ్గర చేస్తున్న సంస్థల వివరాలనూ 'ఎయిర్ లైన్ రేటింగ్స్ డాట్ కామ్' వెల్లడించింది. విమానాల్లో భద్రత, ప్రయాణికులకు అందే సేవల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్టు ప్రకటించింది. 20 బెస్ట్ సేఫెస్ట్ ఎయిర్ లైన్స్ 1. క్వాంటాస్ 2. ఎయిర్ న్యూజిలాండ్ 3. అలస్కా ఎయిర్ లైన్స్ 4. ఆల్ నిప్పాన్ ఎయిర్ లైన్స్ 5. అమెరికన్ ఎయిర్ లైన్స్ 6. కాథే పసిఫిక్ ఎయిర్ వేస్ 7. ఎమిరేట్స్ 8. ఎతిహాద్ ఎయిర్ వేస్ 9. ఈవీఏ ఎయిర్ 10. ఫిన్నార్ 11. హవాయిన్ ఎయిర్ లైన్స్ 12. జపాన్ ఎయిర్ లైన్స్ 13. కేఎల్ఎం 14. లుఫ్తాన్సా 15. స్కాండినేవియన్ ఎయిర్ లైన్ సిస్టమ్ 16. సింగపూర్ ఎయిర్ లైన్స్ 17. యునైటెడ్ ఎయిర్ లైన్స్ 19. వర్జిన్ అట్లాంటిక్ 20. వర్జిన్ ఆస్ట్రేలియా ఇక భద్రతలో అతి తక్కువ ప్రమాణాలు పాటిస్తున్న విమానయాన సంస్థల్లో... బాతిక్ ఎయిర్, బ్లూవింగ్ ఎయిర్ లైన్స్, సిటీ లింక్, కాల్-స్టార్ ఏవియేషన్, లయన్ ఎయిర్, శ్రీవిజయ ఎయిర్, ట్రాన్స్ నుసా, త్రిగణా ఎయిర్ సర్వీసెస్, వింగ్స్ ఎయిర్, ఎక్స్ ప్రెస్ ఎయిర్ లు టాప్-10లో నిలిచాయి. అతి తక్కువ ధరలకు సేవలందిస్తున్న ఎయిర్ లైన్స్ లో ఎయిర్ లింగస్, ఫ్లైబీ, హెచ్కే ఎక్స్ ప్రెస్, జెట్ బ్లూ, జెట్ స్టార్ ఆస్ట్రేలియా, థామస్ కుక్, టీయూఐ ఫ్లయ్, వర్జిన్ అమెరికా, వోలారిస్, వెస్ట్ జెట్ సంస్థలున్నాయి. అత్యంత సేఫెస్ట్ ఎయిర్ లైన్స్ పై ఓటింగ్ నిర్వహించగా, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు అత్యధికులు ఓటేశారు. ఆపై ఎమిరేట్స్, క్వాంటాస్, ఎయిర్ న్యూజిలాండ్, వర్జిన్ అట్లాంటిక్, కాథే పసిఫిక్, కేఎల్ఎం, లుఫ్తాన్సా, ఎతిహాద్, స్విస్ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల మన్ననలను చూరగొన్నాయి.

  • Loading...

More Telugu News