: కాశ్మీర్ లేకుండా పాకిస్థాన్ ఏంటి?... ఉద్రిక్తత పెంచేలా పాక్ అధ్యక్షుడి మాటలు


ఓవైపు పాకిస్థాన్ తో శాంతినే కోరుతున్న భారత్, చర్చల ప్రక్రియ కొనసాగించేందుకు ముందడుగు వేస్తున్న వేళ, పఠాన్ కోట్ పై ఉగ్రదాడి కలకలం సృష్టించగా, తాజాగా పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఉద్రిక్తతలను మరింత పెంచే వ్యాఖ్యలు చేశారు. హురియత్ కాన్ఫరెన్స్ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "కాశ్మీర్ లేకుండా పాకిస్థాన్ లేదు. కాశ్మీర్ లో వేర్పాటువాదానికి మా దేశం మద్దతును కొనసాగిస్తుంది. భారత ఉపఖండంలో కాశ్మీర్ అంశం పాకిస్థాన్ అజెండాలోనే ఉంది" అన్నారు. కాశ్మీరులో భారత ప్రభుత్వం పౌర హక్కులను ఉల్లంఘిస్తోందని, దాన్ని తక్షణం నిలిపివేయాలని కూడా హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చెప్పిన మాటలను గుర్తు చేసిన ఆయన, పాకిస్థాన్ లోని 'కే' అనే అక్షరం కాశ్మీర్ ను సూచిస్తుందని, ఆ ప్రాంతం లేకుండా పాక్ లేదని అన్నారు.

  • Loading...

More Telugu News