: మాజీ సీఎం యడ్యూరప్పపై పలు కేసులు కొట్టివేత
కర్ణాటక మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బి.ఎస్ యడ్యూరప్పపై నమోదైన పలు కేసులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. అక్రమ డి-నోటిఫికేషన్ కు సంబంధించి ఆయనపై నమోదైన 15 కేసులను కొట్టివేస్తూ ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీఎంగా ఉన్న సమయంలో భూముల డి.నోటిఫికేషన్ కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారంటూ యడ్డీపై కేసులు నమోదయ్యాయి. వాటన్నింటికీ ఆధారాలు లేవని, వాటిని కొట్టివేయాలని కోరుతూ యడ్డీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి రత్నకళ పదిహేను కేసులను కొట్టివేస్తున్నట్టు తీర్పు వెలువరించారు.