: ట్విట్టర్లో కొత్త మార్పులు... ఇక ఎంతైనా రాసుకోవచ్చు
ట్విట్టర్లో త్వరలో రాబోతున్న మార్పులు నెటిజన్లను మరింత ఆనందపరచనున్నాయి. ఇప్పటివరకూ 140 క్యారెక్టర్ల వరకూ రాసుకునే వీలుండగా, దానిని 10వేల క్యారెక్టర్లకు పెంచాలని ట్విట్టర్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకూ అధికంగా సమాచారం పంపించాలనుకున్నవారు ఎంతో నిరాశకు గురయ్యేవారు. ఇకపై ఆ లోటును భర్తీచేసే దిశగా ట్విట్టర్ రంగం సిద్ధం చేసింది. దీనితోపాటు ఇకపై నెటిజన్లు తమ ట్విట్టర్ ఖాతాలో అధిక సంఖ్యలో వీడియోలు, ఇతర లింకులను పంపించుకునే అవకాశమేర్పడింది. ఇటీవలి కాలంలో ట్విట్టర్ కు ఆదరణ పెరుగుతున్నందున సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.