: మోదీ పాక్ యాత్ర తప్పేం కాదు: ఆర్ఎస్ఎస్
పఠాన్ కోట్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం మోదీపై విమర్శల వెల్లువ కొనసాగుతుండగా, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రధానిని సమర్థించింది. మోదీ పాక్ పర్యటన తప్పేం కాదని, పైగా ఇది ఇరు దేశాల శాంతి ప్రక్రియకు నాంది లాంటిదని పేర్కొంది. పాక్ వెళ్లాలని మోదీ తప్పుడు నిర్ణయం తీసుకోలేదని, అయినా ప్రధానికి ఇటువంటి విషయాల్లో స్వయం నిర్ణయం తీసుకునే హక్కు ఉందని వెనకేసుకొచ్చింది. అయితే భారత్ పాకిస్తాన్ ల మధ్య చర్చలు జరగడంపై సంఘ్ కు కాస్త వ్యతిరేకత ఉన్నా, పొరుగుదేశంతో స్నేహసంబంధాలు వెల్లివిరియడానికి చర్చలు దోహదపడతాయని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే మోదీని వెనకేసుకొచ్చినట్టు భోగట్టా.