: మోడీ గౌరవప్రదంగానే పాకిస్తాన్ వెళ్లారు... అయినా ఇలా జరిగింది: శత్రుఘ్న సిన్హా
పఠాన్ కోట్ లో ఉగ్రవాద దాడి జరిగిన అనంతరం మోడీ పాక్ పర్యటనపై భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత, సినీనటుడు శత్రుఘ్నసిన్హా ప్రధాని పాక్ పర్యటనను సమర్థించారు. ప్రతిసారి సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసే శత్రుఘ్న సిన్హా ఈసారి మోడీని వెనకేసుకురావడం విశేషం. ప్రధాని గౌరవప్రదంగానే పాకిస్తాన్ లో పర్యటించారని, కానీ ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. తన స్వీయ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా శత్రుఘ్న మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ జరిపిన దాడులను అందరూ వ్యతిరేకించాల్సిందేనని పేర్కొన్నారు. అలాగే మోడీ చాలా టాలెంటెడ్ పర్సన్ అని శత్రుఘ్న పొగడ్తలతో ముంచెత్తారు.