: సచిన్ నా మార్గదర్శి... పరుగుల వీరుడు ప్రణవ్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో టన్ను పరుగులు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు ప్రణబ్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్ లో 1009 పరుగులు చేసిన ప్రణబ్ నాటౌవుట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ, ‘బ్యాటింగ్ కు వెళ్లే సమయంలో రికార్డు మనస్సులో లేదు. సాధారణంగా బ్యాటింగ్ చేస్తూనే మంచి స్కోర్ ను చేరుకోవడంతో రికార్డు నమోదైంది. రోజూ 3 గంటలు సాధన చేస్తా. మంచి కళాశాలలో చేరిన తర్వాత చదువుకుంటూనే క్రికెట్ పై దృష్టి సారిస్తా. సచిన్ టెండూల్కర్ నా మార్గదర్శి’ అని పేర్కొన్నాడు.