: సహజత్వం కోసమే గుండు చేయించుకున్నా: బుల్లి తెర నటి రింకూ
సహజత్వం కోసం... పాత్రలో జీవించేందుకే గుండు చేయించుకున్నానని హిందీ సీరియల్ నటి రింకూ కర్మార్కర్ చెప్పింది. జీ టీవీలో ప్రసారమయ్యే ‘యే వాదా రహా’ అనే సీరియల్ కోసం రింకూ తన కేశాలను త్యాగం చేసింది. ఈ సందర్భంగా రింకూ మాట్లాడుతూ, ఈ సీరియల్ లో తాను నటిస్తున్న క్యారెక్టర్ కు న్యాయం చేయాలన్న తపనతోనే ఈ పని చేశానని చెప్పింది.