: సినీ దర్శకుడు దాసరి తో వైఎస్ జగన్ భేటీ
మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావును హైదరాబాదులోని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈరోజు కలిశారు. కాపు కులస్తులకు ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశ్యంలో జగన్ ఉన్నారని, అందుకే దాసరితో భేటీ అయ్యారని రాజకీయ వర్గాల సమాచారం. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దాసరి దూరంగా ఉంటున్నారు. దాసరి వైఎస్సార్సీపీ లో చేరే ఉద్దేశ్యంతో ఉన్న కారణంగానే జగన్ ఆయనతో సమావేశమైనట్లు సమాచారం.