: మాకు ఎవరి పట్లా ద్వేషం, కక్ష లేవు: మంత్రి కేటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ తనవంతుగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ లోని సీమాంధ్రులను ఆకట్టుకునే లక్ష్యంగా ఇటీవల ఆయన ప్రసంగం సాగుతోంది. ఇవాళ నగరంలో ఖైరతాబాద్ లో మాట్లాడుతూ, తమకు ఎవరి పట్లా ద్వేషం, కక్ష లేవన్నారు. 2014 ఎన్నికలు భావోద్వేగాల మధ్య జరిగాయని, అప్పుడు తమను హైదరాబాద్ ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఇక ఉద్యమ సమయంలో సీమాంధ్రులపై పౌరుషంగా మాట్లాడామన్న కేటీఆర్, ఈ 18 నెలల్లో తమ పరిపాలన ఎలా ఉందో చూశారని పేర్కొన్నారు. అందుకని సీమాంధ్ర ప్రజలు ఆత్మవిమర్శ చేసుకుని ఓటేయాలని కోరారు. ఇక ఇద్దరు సీఎంలు కలిసి ఉండటం కూడా కొందరికి నచ్చడం లేదని ఆరోపించారు.