: మరో బాలీవుడ్ అగ్రహీరోతో సైనా సెల్ఫీ!
ప్రముఖ బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్, కాజోల్ తో పాటు 'దిల్ వాలే' చిత్ర యూనిట్ తో ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ ఇటీవల సెల్ఫీలు దిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ హీరోతో ఆమె సెల్ఫీ దిగింది. అక్షయ్ కుమార్ తో తాను దిగిన సెల్ఫీని సైనా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అక్షయ్ తో ఫొటో దిగడం తనకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ కూడా చేసింది. ఈ సందర్భంగా అక్షయ్ కూడా స్పందించాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో పాల్గొంటున్న సైనా బెస్ట్ టీమ్ టైటిల్ గెలుస్తుందన్న ఆశాభావాన్ని అక్షయ్ వ్యక్తం చేశాడు. ఆమెకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ కు అక్షయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.