: జీహెచ్ఎంసీ ఎన్నికలకు, కేంద్ర నిధులకు ముడిపెట్టొద్దు: దత్తాత్రేయ


కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇప్పిస్తే గ్రేటర్ ఎన్నికల్లో తాను బీజేపీకే ఓటేస్తానని ఎంపీ కవిత చేసిన సవాల్ పై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎన్నికలకు, నిధులకు ముడిపెట్టవద్దని ఢిల్లీలో ఆయన అన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి రూ.40వేల కోట్లు కేటాయించామని, గృహ నిర్మాణం కింద 40వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. అలాంటప్పుడు టీఆర్ఎస్ నేతలు తమపై అనవసరంగా విమర్శలు చేయడం ఎందుకని దత్తాత్రేయ మండిపడ్డారు. ఈ ఏడాది సనత్ నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజిని ప్రారంభిస్తామని... 8 శాతం సీట్లను కార్మికుల పిల్లలకు కేటాయిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News