: టీవీ యాంకర్ తో 'బయటకు వెళ్దాం పద' అన్నందుకు క్రిస్ గేల్ కు జరిమానా!
బిగ్ బాష్ లీగ్ పోటీల్లో విజయం అనంతరం ఓ టీవీ యాంకర్ మెల్ మెక్ లాలిన్ తో అసభ్యకరంగా మాట్లాడినందుకు వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ కు రూ. 4.75 లక్షలు (10 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు) జరిమానా విధిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆ యాంకర్ తో మాట్లాడుతూ, "సిగ్గు పడకు, మనం మ్యాచ్ గెలిచాం. ఇక బయటకు వెళ్దాం రా" అంటూ అభ్యంతరకర రీతిలో మాట్లాడిన సంగతి తెలిసిందే. క్రిస్ వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడ్డ విచారణ కమిటీ జరిమానా ఖరారు చేసింది. ఈ సొమ్మును రొమ్ము క్యాన్సర్ రోజులకు సేవలందిస్తున్న మెక్ గ్రాత్ ఫౌండేషన్ కు ఇస్తామని అధికారులు వెల్లడించారు.