: మోదీకి ఫోన్ చేసిన నవాజ్ షరీఫ్
ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. పఠాన్ కోట్ ఘటనపై మోదీతో సంభాషించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని, జరిగిన దానికి చింతిస్తున్నామని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ ప్రారంభిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, నవాజ్ షరీఫ్ మనవరాలి వివాహాన్ని పురస్కరించుకుని మోదీ పాకిస్థాన్ వెళ్లిన సందర్భంగా శాంతి చర్చలకు పునాది పడిన సంగతి తెలిసిందే. ఈ శాంతి చర్చలను ఆపాలనే ఉద్దేశంతోనే ఉగ్రదాడులకు పాల్పడినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి నవాజ్ ఫోన్ చేయడం శాంతి చర్చలపై ఇరు దేశాల ప్రధానుల చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.