: మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతోంది: ఎమ్మెల్యే వివేక్ గౌడ్
జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు తగ్గిస్తూ ప్రభుత్వం చట్టసవరణ చేయడంపై పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ లో టీఆర్ఎస్ కు పట్టులేకున్నా అప్రజాస్వామికంగా మేయర్ పదవిని దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ మండిపడ్డారు. కుక్కలు చింపిన విస్తరిలా డివిజన్ల పునర్విభజన ఉందన్నారు. ఎమ్మెల్సీలు ఎక్కడి వారైనా జీహెచ్ఎంసీలో ఓటు హక్కు కల్పిస్తూ సవరణ తీసుకొచ్చారని వివేక్ ఆగ్రహించారు. రిజర్వేషన్ల వివరాలను టీఆర్ఎస్, ఎంఐఎంలకు రహస్యంగా అందజేశారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఎన్నికలకు కేవలం 14 రోజుల గడువు అన్నది దేశంలో ఏ నగరంలోను లేదని, ఇదంతా చూస్తుంటే టీఆర్ఎస్ పెద్ద స్కామ్ కు తెరలేపినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. మజ్లిస్ కు లాభం చేకూరాలనే పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా చేశారని విమర్శించారు.