: సోషల్ మీడియా మొత్తాన్నీ తప్పుదారి పట్టించిన మార్ఫింగ్ ఫోటో ఇది!
సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతగా పెరిగిందన్న విషయానికి ఇదో సరికొత్త ఉదాహరణ. ఢిల్లీలో అమలవుతున్న 'సరి-బేసి' విధానానికి మద్దతు పలికిన సోషల్ మీడియా, ఓ ఫోటో కారణంగా కేజ్రీవాల్ సర్కారుపై తీవ్ర విమర్శలకు దిగింది. ఆపై తప్పు తెలుసుకుంది. ఇంతకీ జరిగిందేమంటే, టాప్ పై కిక్కిరిసిన ప్రయాణికులతో ఉన్న మెట్రో రైలు ఫోటోను ఎవరో అప్ లోడ్ చేశారు. ఆ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరూ, సరైన ప్రయాణ ఏర్పాట్లు లేకుండా సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇక ఆ ఫోటో 2014లో దీపావళి నాటిదని, అప్పట్లో దాన్ని ప్రచురించిన 'హిందుస్థాన్ టైమ్స్' ప్రకటించింది. తమ మెట్రో రైల్ చిత్రాన్ని ఎవరో మార్ఫింగ్ చేశారని ప్రకటించింది. అప్పుడు అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు కామ్ అయిపోయారు.