: అది మా అన్న గొంతే... కొత్త 'జీహాదీ జాన్' చెల్లెలు కోనికా ధర్!


కరడుగట్టిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిగా మారిన సిద్ధార్థ ధర్ బ్రిటన్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న వీడియో తాజాగా విడుదల కాగా, ఆయన చెల్లెలు కోనికా ధర, తన అన్న గొంతును గుర్తు పట్టారు. ఆ వీడియోను చూసిన కోనికా, "నేనిప్పుడు షాక్ లో ఉన్నాను. అది నా అన్నయ్య గొంతు మాదిరిగానే ఉంది. కానీ, నేను చూసిన క్లిప్ చాలా చిన్నది. పూర్తి నిర్థారణకు రాలేకపోతున్నా" అని వ్యాఖ్యానించారు. మరోవైపు అతనితో పరిచయం ఉన్న వారు సైతం అది సిద్ధార్థ గొంతేననడంలో అనుమానం లేదని బ్రిటన్ అధికార న్యూస్ చానల్ బీబీసీకి వెల్లడించారు.

  • Loading...

More Telugu News