: ఆగని ‘ఉగ్ర’ దాడులు... అఫ్ఘన్ లోని జలాలాబాదులో ఇండియన్ ఎంబసీ వద్ద భారీ పేలుడు
భారత్ పై ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పంజా విసిరిన ఉగ్రవాదులు ఏడుగురు భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మరునాడే అఫ్ఘనిస్థాన్ లోని మజారే షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకెళ్లిన ఉగ్రవాదులు కాల్పుల మోత మోగించారు. అయితే వేగంగా స్పందించిన ఐటీబీపీ జవాన్లు ఉగ్రవాద దాడిని తిప్పికొట్టారు. ఈ ఘటనలో భారత సైన్యానికి గాని, దౌత్య కార్యాలయ సిబ్బంది గాని ఎలాంటి అపాయం జరగలేదు. తాజాగా కొద్దిసేపటి క్రితం అఫ్ఘన్ లోని జలాలాబాదులోని ఇండియన్ ఎంబసీకి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలోనూ భారత రాయబార కార్యాలయానికి చెందిన సిబ్బందికి ఎలాంటి అపాయం జరగలేదు. అయితే ఈ ఘటన అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.