: జీహెచ్ఎంసీ ఎన్నికల చట్టసవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది: తలసాని


జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు తగ్గిస్తూ చట్టసవరణ చేయడంపై వస్తున్న విమర్శలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. నిబంధనల ప్రకారమే చట్టంలో మార్పులు చేశామన్నారు. ప్రధానంగా ఎన్నికల వ్యయం తగ్గించడమే లక్ష్యంగా చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. ఒకవేళ దానిపై పార్టీలు కోర్టులకెళ్లినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. అయితే దమ్ముంటే ఎన్నికల్లో తమను ఎదుర్కోవాలని విపక్షాలకు తలసాని సవాల్ విసిరారు. మరోవైపు ఎన్నికల గడువు తగ్గింపుపై హైకోర్టులో పిటిషన్ వేయాలని ఇతర పార్టీలు సిద్ధమవుతున్నాయి.

  • Loading...

More Telugu News