: ఇక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు 'అందాల ఎర' వేస్తున్న ఐఎస్ఐ!
రక్షణ శాఖలోని ఉన్నతోద్యోగుల ఫోన్ నంబర్ల వివరాలు సేకరించేందుకు ఐఎస్ఐ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై 'అందాల ఎర' వేస్తోందని, ఏ ఉద్యోగి కూడా ఎవరితోనూ ఫోన్ నంబర్ల వివరాలు పంచుకోరాదని రాజస్థాన్ రక్షణ శాఖ వర్గాలు సూచించాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు సమాచారం ఇస్తూ, పాక్ ఇంటెలిజన్స్ వర్గాల కొత్త రూట్ పై సమాచారం అందిందని, యువతులతో ఇంటర్నెట్ కాల్స్ చేయిస్తూ, రక్షణ రహస్యాలు తెలుసుకోవాలన్నది వారి ప్రయత్నమని హెచ్చరించాయి. ఉన్నతాధికారులు, జవాన్ల ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్లు తెలుసుకోవాలన్నది వారి ఉద్దేశమని, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య పాక్ నుంచి కొన్ని కాల్స్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వచ్చాయని అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికాధికారులకు పాక్ నుంచి ఫోన్లు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ ఓజా వెల్లడించారు.