: రాష్ట్రం అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందాలని కోరుకున్నా: స్పీకర్ కోడెల
ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నానని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే అసెంబ్లీ ప్రతిష్ఠ పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్పీకర్ శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు స్వాగతం పలికారు. దర్శనానంతరం మీడియాతో స్పీకర్ పైవిధంగా మాట్లాడారు.