: పఠాన్ కోట్ దాడిని ఖండించిన అమెరికా... ముష్కరులపై పాక్ చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడిని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. అంతేకాక దాడికి వ్యూహ రచన చేసిన వారిపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ డిమాండ్ చేశారు. పఠాన్ కోట్ దాడికి సంబంధించి దోషులను శిక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని పాక్ ప్రకటించిన మరుక్షణమే అమెరికా ఈ మేరకు స్పందించడం గమనార్హం. ‘‘పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి కుట్రదారులపై చర్యలు తీసుకుంటామని పాక్ ప్రకటించడం ముదావహం. అయితే ప్రకటించిన మేరకు పాక్ వేగంగా చర్యలు చేపట్టాల్సి ఉంది’’ అని కిర్చీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News